Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 14:05:23
facebook Twitter Googleplus
Photo

వరుసగా మూడు హిట్లు అందుకున్న హీరో.. ఎంత పారితోషికం తీసుకోవాలి. 10 నుంచి 15కోట్లు పైగా ఆదాయం తెచ్చిపెట్టే హీరో ఏ రేంజు పే-ప్యాకేజీ అందుకోవాలి?. మీరైతే ఏం చెబుతారు? కోటి డిమాండ్ చేస్తే తప్పేనంటారా? నిజానికి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టే హీరో ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్ గురించి ఇండస్ర్టీలో రకరకాల డిస్కషన్స్ సాగుతున్నాయి. పదండి చూద్దాం.

మనోడు డిమాండ్ చేస్తున్న కోటి పారితోషికం ఒప్పుడు ఒక హాట్ టాపిక్. లేటెస్టుగా కుమారి 21 ఎఫ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రాజ్ తరుణ్. ఈ మూవీకి ఫుల్ రన్ లో దాదాపు 15 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా కంటే ముందే ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మావ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. అందుకే ఇప్పుడు మరో సినిమాకి సంతకం చేయాలంటే కోటి డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.

అతడితో సినిమా చేస్తున్న ఓ నిర్మాత చెప్పిన దాని ప్రకారం.. అతడు కేవలం 30లక్షలు అడుగుతాడనుకున్నా. 15 లక్షల అందుకునేప్పుడు అతడితో ముచ్చటించాను. అలాంటిది ఇప్పుడు ఏకంగా కోటి అడిగేస్తున్నాడు.. అంటూ చెప్పుకోవడం విశేషం. పిండి కొద్దీ రొట్టె. సక్సెస్ కొద్దీ పారితోషికం. రాజ్ తరుణ్ చేస్తున్నది తప్పు అని అనగలమా? కోటి అడిగే హీరో వల్ల బాక్సాఫీస్ వద్ద రూ7 కోట్ల షేర్ రావాలన్నది ఓ లెక్క. అంత తేలేని హీరోకి కోటి పెట్టనక్కర్లేదు. రాజ్ తరుణ్ ప్రూవ్డ్. కాబట్టి ఆమాత్రం ఇస్తే తప్పేం లేదనే అంటున్నారంతా.

,  ,  ,