Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2016 12:18:22
facebook Twitter Googleplus
Photo

కుమారి 21 ఎఫ్ సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జోడీ. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం కూడా ఈ జోడీ ఖాతాలో మరో సక్సెస్ జమ చేసింది. ఐతే ఈడోరకం ఆడోరకం సినిమా చేస్తున్న టైంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్లో ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా కనిపించారు. ఒకరితో ఒకరు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఐతే వీళ్లిద్దరి మధ్య అందరూ అనుకుంటున్నట్లు విభేదాలేమీ లేవని తెలుస్తోంది. హెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో రాజ్ తరుణ్ క్యామియో రోల్ చేస్తుండటమే ఇందుకు రుజువు.

?కుమారి 21 ఎఫ్? తరహాలోనే హెబ్బా కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ?నేను నా బాయ్ ఫ్రెండ్స్?. ఇందులో హెబ్బా బాయ్ ఫ్రెండ్స్ గా కొత్తవాళ్లు నటిస్తున్నారు. ఐతే హెబ్బాకు రాజ్ తరుణ్ కు మంచి జోడీ కుదిరిన నేపథ్యంలో ఈ సినిమాలో అతడితో ఓ క్యామియో రోల్ చేయిస్తున్నారు. క్లైమాక్స్ లో ఈ పాత్ర తళుక్కున మెరుస్తుందట. రాజ్ తరుణ్ తో ?సినిమా చూపిస్త మావ? నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర శిష్యరికం చేసిన భాస్కర్ బండి ?నేను నా బాయ్ ఫ్రెండ్స్?తో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. నవంబర్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,  ,