Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2016 13:14:47
facebook Twitter Googleplus
Photo

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21F.. ఇలా వరుస హిట్స్‌తో తెలుగులో అతికొద్ది మందికే సాధ్యమైన హ్యాట్రిక్ ఫీట్‌ను కెరీర్ ప్రారంభంలోనే సొంతం చేసుకున్న హీరో రాజ్ తరుణ్, ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారిపోయారు. ఇక ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా రాజ్ తరుణ్‌పై ఓ పుకారు షికారు చేస్తూ వస్తోంది. లాస్య అనే యాంకర్‌తో రాజ్ తరుణ్ వివాహం జరిగిందని, సీక్రెట్‌గా రాజ్ తరుణ్ ఆమెను పెళ్ళిచేసుకున్నారన్నది ఆ పుకారు సారాంశం.
ఇక తాజాగా ఈ పుకార్లపై తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటివి రాసేవాళ్ళకు ఎలాంటి సమాధానం ఇవ్వాళో కూడా అర్థం కావడం లేదని రాజ్ తరుణ్ అన్నారు. తనకు, లాస్యకు పెద్దగా పరిచయమే లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మంచి కాదని అన్నారు. అదేవిధంగా ఎవరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్ళిచేసుకునే పరిస్థితి తనకు లేదని, పెళ్ళి గురించి ఇప్పుడేమీ ఆలోచించలేదని, ఆ రోజు వచ్చినప్పుడు తానే స్వయంగా చెబుతానని రాజ్ తరుణ్ అన్నారు.

,  ,  ,  ,  ,