Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 10:32:55
facebook Twitter Googleplus
Photo

రవితేజ కొత్త సినిమా అనౌన్స్ మెంట్లు వరుసగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టచ్ చేసి చూడు అంటూ విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో ఓ మూవీ కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. జనవరి 26న రిపబ్లిక్ డే తో పాటు రవితేజ బర్త్ డే కూడా కావడంతో.. వరుసగా కొత్త ప్రాజెక్టులపై అధికారికంగా ప్రకటనలు వస్తున్నాయి.

ఇప్పుడు రాజా ది గ్రేట్ అనే మూవీ కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు మాస్ మహరాజ్. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా.. వచ్చే నెలలోనే ఈ సినిమాకూడా ప్రారంభం కానుంది. రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ గుడ్డివాడి పాత్రను చేయబోతున్నాడు. సాయిధరంతేజ్ తో సుప్రీమ్ తర్వాత.. ఈ అంధుడి పాత్రతో మాస్ మూవీని.. రామ్ చేస్తున్నానంటూ ట్విట్టర్ లో అనిల్ రావిపూడి చెప్పాడు. రామ్ కూడా కన్ఫాం చేశాడు. ఆ తర్వాత రామ్ తప్పుకోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరకు చేరింది. చాలా రోజుల పాటు ఊగిసలాడిన ఎన్టీఆర్.. చివరకు నో చెప్పేశాడు.

ఇదే సబ్జెక్టును చిన్నా చితకా మార్పులతో రవితేజతో చేస్తున్నాడు అనిల్ రావిపూడి. మొత్తానికి మాస్ మహరాజ్ ఒకేసారి రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేయడం.. రెండూ ఏకకాలంలో షూటింగ్ జరుపుకోనుండడంతో.. రవితేజ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడని అనుకోవచ్చు.

,  ,  ,  ,  ,  ,