Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2017 10:43:09
facebook Twitter Googleplus
Photo

రెండు భాగాల మధ్య దొరికిన ఖాళీలో మిగతా యూనిట్ సభ్యులు కొంత రిలాక్సయ్యారు కానీ.. రాజమౌళి మాత్రం అప్పుడు కూడా బిజీగానే ఉన్నాడు. బాహుబలి: ది కంక్లూజన్ రిలీజైన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఖాళీ లేదు. ఆ తర్వాత మాత్రం కొంత విశ్రాంతి తీసుకున్నాడు జక్కన్న.

ఒకటికి రెండు టూర్లు వేసి మళ్లీ కొత్త సినిమా పనిలో పడ్డాడు. ఐతే కథాచర్చలు జోరుగానే నడుస్తున్నట్లున్నాయి కానీ.. జక్కన్న తర్వాతి సినిమా ఏంటనే విషయంలో స్పష్టత మాత్రం రావట్లేదు. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. అంటూ జక్కన్న తర్వాతి సినిమాలో హీరో అంటూ రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటిదాకి అధికారిక సమాచారం అయితే ఏదీ రాలేదు. అసలు రాజమౌళి తర్వాతి సినిమా ఏదో ఇంకా ఫిక్సయినట్లే లేదు.
ఓ రెండు మూడు నెలల పాటు రాజమౌళి తర్వాతి సినిమా గురించి చర్చలు నడిపిన జనాలు.. విసుగొచ్చేసి ఆ సంగతి పక్కన పెట్టేశారు. సోషల్ మీడియాలో కానీ.. ఇతర మాధ్యమాల్లో కానీ ఇప్పుడు రాజమౌళి కొత్త సినిమా గురించి చర్చ లేదు. ఊహాగానాలు కట్టిపెట్టేసి సైలెంటైపోయారందరూ. రాజమౌళి కూడా ఈ మధ్య బయటెక్కడా కనిపించట్లేదు.

,  ,  ,  ,