Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 10:11:31
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ స్టార్ హీరోలందరిలో ప్రభాస్ చాలా భిన్నంగా కనిపిస్తాడు. మిగతా హీరోలతో పోలిస్తే చాలా సింపుల్ గా ఉంటాడు ప్రభాస్. వేదికలెక్కి అధిక ప్రసంగాలు చేయడు. సోషల్ మీడియాలో లేని పోనివి మాట్లాడడు. సినిమాల్లో కానీ.. బయట కానీ టూమచ్ బిల్డప్ ఉండదు. అభిమానుల్ని మొబిలైజ్ చేయడం.. వారితో లేనిపోని హంగామా చేయించడం కూడా అరుదు. చాలా రిజర్వ్డ్ గా కనిపిస్తాడు. ఇలా మొత్తంగా కొందరు స్టార్ హీరోలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తాడు ప్రభాస్. ఈ లక్షణాలే తనకూ ప్రభాస్ అంటే చాలా ఇష్టం కలిగేలా చేశాయంటున్నాడు రాజమౌళి. హీరోగా కంటే కూడా వ్యక్తిగతంగా ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఛత్రపతి తర్వాత మళ్లీ మేమిద్దరం కలిసి ‘బాహుబలి’ చేసే సమయానికి నటుడిగా ప్రభాస్ లో చాలా మార్పు చూశాను. బుజ్జిగాడు.. డార్లింగ్ లాంటి సినిమాలతో అతను చాలా నేర్చుకున్నాడు. ఏ డైలాగ్ ఎలా చెప్పాలి. ఎక్కడ లాగాలి.. ఎక్కడ ఆపాలి.. లాంటి విషయాలపై బాగా అవగాహన వచ్చింది. సటిల్ పెర్ఫామెన్స్ ఇవ్వడం తెలుసుకున్నాడు. ఎమోషన్ల విషయంలోనూ పరిణతి కనిపించింది. ఇక వ్యక్తిగతంగా అయితే ప్రభాస్ లో ఏ మార్పూ లేదు. ఇన్నేళ్లలో తన ఇమేజ్ ఎంతో మారినా వ్యక్తిగతంగా ఏమీ మారలేదు. అదే మంచితనం.. అణకువతో ఉన్నాడు ఇప్పుడు కూడా. తనకు సిగ్గు ఎక్కువ. మొహమాటపడతాడు. అలాగని ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. ఎవరినైనా కలిస్తే మొహమాటం కొద్దీ ఏవైనా అనవసర మాటలు మాట్లాడాల్సి వస్తుందనే ఎవ్వరినీ కలవడానికి అంతగా ఇష్టపడడు. కొంచెం కూడా గర్వం ఉండదు. అందరినీ పట్టించుకుంటాడు.

,  ,  ,  ,  ,