Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 15:16:39
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి నెక్స్ట్ సినిమాపై ఇంకా సస్పెన్స్ ను కోనసాగిస్తునే ఉన్నాడు. బాహుబలి సెకండ్ పార్ట్ విడుదలై చాలా కాలమే అవుతోంది. కానీ ఇప్పటివరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కనీసం ఒక వివరణ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే బాహుబలి నటి నటులు వారి సినిమాలపై ఫుల్ క్లారిటి ఇచ్చేశారు. కానీ అసలైన బాహుబలి సారధి జక్కన్న మాత్రం కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాడు. ఎన్ని రూమర్స్ వస్తోన్న స్పందించడం లేదు.

అయితే బాహుబలి రిలీజ్ తర్వాత మాత్రం తప్పకుండా ప్రముఖ నిర్మాత డివివి.దానయ్య బ్యానర్ లోనే ఒక సినిమా ఉంటుందని తెలిపాడు. దానయ్య కూడా ముందుగానే జక్కన్న కి అడ్వాన్స్ ఇచ్చేసి కూల్ గా ఉన్నాడట. ఆ తర్వాత రాజమౌళి మెగా ఫ్యామిలీ సైడ్ ఎక్కువగా తిరగడంతో అందరు చెర్రీతో సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని దానయ్యను అడుగగా అయన ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని చెప్పాడు.

ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ తో జోరుగా కథా చర్చలు జరుపుతున్నాడట రాజమౌళి. దాదాపు కథ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. దీంతో సినిమా ఫైనల్ గా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

,  ,  ,  ,  ,  ,