Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Feb-2017 13:26:45
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకో రెండు నెలలే సమయముంది. ఇప్పటిదాకా కొన్ని పోస్టర్లు మాత్రమే వదిలారు తప్ప.. ఇంకే విశేషాలూ బయబటికి రాలేదు. ది బిగినింగ్ ట్రైలర్ ను చాలా ముందుగానే లాంచ్ చేశారు. అది సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ది కంక్లూజన్ ట్రైలర్ ఎలా ఉంటుందో.. అది సినిమాపై ఇప్పటికే ఉన్న భారీ అంచనాల్ని ఇంకెంత పెంచేస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ బాహుబలి-2 ట్రైలర్ ఎప్పుడొస్తుందన్న క్లారిటీ కూడా లేదు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో ట్రైలర్ ఊసెత్తాడు రాజమౌళి.

,  ,  ,  ,  ,  ,