Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2017 13:56:12
facebook Twitter Googleplus
Photo

రెండేళ్లుగా ఎవరు మహాభారతం మాటెత్తినా రాజమౌళే గుర్తుకొస్తున్నాడు. బాహుబలి లాంటి విజువల్ వండర్ తీసిన రాజమౌళి.. మహాభారతం తన కలల సినిమా అని చెబుతుండటంతో.. జక్కన్న విజన్ తో మహాభారతం చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే ఆ కలల సినిమా తీయడానికి చాలా సమయం పడుతుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు రాజమౌళి. పదేళ్ల తర్వాతే మహాభారతం తీస్తా అంటూ రెండేళ్ల కిందట ప్రకటించిన రాజమౌళి.. ఈ మధ్య అడిగినా అదే పదేళ్ల మాట చెప్పాడు. అంతకుమించి ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడింది లేదు. ఐతే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం రాజమౌళి మహాభారతం పై తన ఆలోచనల్ని కొంచెం వివరంగా చెప్పాడు. పదేళ్ల మాట పక్కన పెట్టి.. గత రెండేళ్లను మైనస్ చేసి ఎనిమిదేళ్లలో ఆ సినిమా తీస్తా అని రాజమౌళి చెప్పడం విశేషం.

మహాభారతం ప్రాజెక్టు నాకు చాలా ఇష్టం. ఐతే వెంటనే ఆ సినిమా చేయాలనుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి మహాభారతంపై రకరకాల వెర్షన్లు చదివాను. చూశాను. మనసులో అది మెగా మెగా మెగా ప్రాజెక్టులాగా ఉంటుంది. అంత పని పెట్టుకోవాలంటే ఇప్పుడే కష్టం. అది పదేళ్ల ప్రాజెక్టు. సాంకేతికంగా అన్ని విధాలా హ్యాండిల్ చేయగలనా అనే భయం ఉంది. ఎందుకంటే అందులో కేవలం స్టార్లను పెట్టుకుంటే సరిపోదు. ఆ పాత్రలకు ఎవరు సరిపోతారో పట్టుకుని.. వారిని మౌల్డ్ చేయాలి. అదో పెద్ద పని. చాలా చాలా పెద్ద చాలెంజ్. ఇప్పటి వరకూ అందరి మనసుల్లో ఉండేవన్నీ తీసేసి.. మహాభారతం ఇదీ అని చెప్పాలి. అంత ఎనర్జీ లెవెల్స్.. అంత సమయం నా దగ్గర ఉందా అనే సెల్ఫ్ డౌట్ నాకుంది.

,  ,  ,  ,  ,