Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 12:36:21
facebook Twitter Googleplus
Photo

అందమైన కల.. దానికి తగ్గ భారీతనం... వాటితో సమానంగా నలుగురికి తన కల చూపించాలన్న తపన.. ఇవే వెండితెరపై రాజమౌళిని స్టార్ దర్శకుడిగా మార్చాయి. మగధీరతో వేసిన బీజం బాహుబలి నాటికి మహావృక్షమయ్యింది. రాజమౌళినుండి తక్కినవారంతా టేకింగ్ విషయంలో పాఠాలు నేర్చుకున్నా లేకపోయినా సినిమాను ప్రజలకు పరిచయం చేసే విధానాన్ని మాత్రం నేర్చుకుని తీరాలి.

మిర్చి మినహా పెద్దగా హిట్లు లేని ప్రభాస్ ప్రతినాయక పాత్ర అప్పటివరకూ పోషించని రానా పెద్దగా పరిచయం లేని సత్యరాజ్ డీ గ్లామర్ పాత్రలో అనుష్క.. ఇన్ని స్టేట్మెంట్స్ ని దాటుకుంటూ బాహుబలి సినిమాని విడుదలకు ముందే ప్రేక్షకులకు పరిచయం చేసిన విధానం తన టాలెంట్ ఇక్కడితో ఆగిపోకూడదని యావత్ దేశానికి గట్టిగా మాట్లాడితే ప్రపంచానికి పరిచయం చేసిన వైనం అసమానం.

హిందీలో పెద్ద నిర్మాణ సంస్థతో ఒప్పందాలు విదేశాలలో ఏ ఉత్సవంలో తమ సినిమా ప్రచారమైనా పనిగట్టుకుని అక్కడికెళ్లి స్పందన తెలుసుకునే నిర్మాతల బృందం ఇవన్నీ బాహుబలికి ప్లస్సే. అందుకే సిరీస్ లతో ఆగకుండా బాహుబలి కామికాన్ అని మార్చేండైజ్ అని యానిమేషన్ సిరీస్ అని వర్చ్యువల్ రియాలిటీ అని లార్జర్ దాన్ లైఫ్ గా మార్చగలిగారు. చివరికి బాహుబలి విగ్రహం ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియం లో ప్రతిష్టించనున్నారు. నిజంగా జక్కన్న ఈ సినిమాను ప్రమోట్ చేసిన విధానాన్ని డాక్యుమెంటరీ చేస్తే ఒక బి స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు మంచి మార్కెటింగ్ పాఠం అవుతుందనడంలో సందేహం లేదు

,  ,  ,  ,  ,