Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 11:48:54
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్.. ప్రస్తుతం దేశం మొత్తంలో మోస్ట్ అవైటింగ్ మూవీ అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. సమ్మర్ హాలిడేస్ ఫినిష్ చేసుకుని.. ఇప్పుడు ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోబోతోంది బాహుబలి సీక్వెల్. రెండో భాగానికి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు.. కంటిన్యూగా పది వారాల పాటు షూటింగ్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ - రానా - అనుష్క - తమన్నా సహా.. ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని చెబుతున్నారు.

బాహుబలి 2 షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత.. ఒక్క ప్రభాస్ తప్ప వేరే లీడ్ యాక్టర్ కూడా యూనిట్ తో ఇప్పటివరకూ కలవలేదు. ఇప్పుడు క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం.. చాలానే రిహార్సెల్స్ చేసినట్లు తెలుస్తోంది. నెలల పాటు ప్రీ విజువలైజేషన్ - రిహార్సల్స్ చేశామని.. యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం రెండు భాగాల్లోనూ అత్యంత ప్రధానమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కావడంతో.. ప్రభాస్ తో పాటు రానా - అనుష్క - తమన్నా - సత్యరాజ్.. ఇలా అందరూ యూనిట్ జత కానున్నారని తెలుస్తోంది.

అక్టోబర్ నెలాఖరు నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోనుందని నిర్మాతలు చెబుతున్నారు. బాహుబలి ది బిగినింగ్ సాధించిన అనితర సాధ్యమైన విజయంతో.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్.. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అయిపోతున్నాయి. ఈసారి రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశాడు.

,  ,  ,  ,  ,  ,