Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 12:11:26
facebook Twitter Googleplus
Photo

బాహుబలి షూటింగ్ లో తాను ఎదుర్కొన్న ఒత్తిడికి మందు నానీనే అంటున్నాడు రాజమౌళి. నాని.. రాజమౌళికి ఏం రిలీఫ్ ఇస్తాడు అనుకుంటున్నారా..? ఐతే ఓసారి ?మజ్ను? సినిమాపై ఓ లుక్కేయండి. ఈ రిలీఫ్ సంగతేంటో తెలిసిపోతుంది. ఈ సినిమాలో రాజమౌళి క్యామియో రోల్ చేశాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది ప్రచారం కాదు.. వాస్తవమే. ?మజ్ను?లో రాజమౌళి కనిపించాడు. అది కూడా రాజమౌళి గానే కనిపించాడు. నాని ఇందులో జక్కన్న దగ్గర ?బాహుబలి? సినిమాకు పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ గా నటించడం విశేషం. అతడి ఇంట్రడక్షన్ బాహుబలి సెట్లోనే ఉంటుంది.

రాజమౌళి హీరో ఎంట్రీ అని చెప్పినపుడు నాని గుర్రం మీది నుంచి దిగుతాడు. డైలాగ్ అనగానే తడబడుతూ గ్రాంథికంలో రాసిన డైలాగులు చెబుతాడు. అది చూసి రాజమౌళి.. ఆయన తనయుడు కార్తికేయ అసహనానికి గురవుతారు. తర్వాత ఇలాగేనా డైలాగ్ చెప్పేది అంటూ ఫ్రస్టేట్ అయిన రాజమౌళి.. ప్రభాస్ ఎక్కడ అని అడుగుతాడు. నాని కారవాన్లో అని బదులిస్తాడు. తర్వాత తమన్నా గురించి అడిగితే కూడా అదే జవాబు చెబుతాడు. రాజమౌళి కోపం చూసి.. వేరే కారవాన్లో అంటాడు. అప్పుడు రాజమౌళి.. మీ భీమవరం తెలివితేటలు ఇక్కడ చూపించకు అంటూ వార్నింగ్ ఇస్తాడు. నాని సైడైపోయాక.. పక్కనున్న వ్యక్తి అతణ్ని తీసేద్దామా అంటాడు. దానికి రాజమౌళి నవ్వుతూ.. ??ఈ స్ట్రెస్ లో వాడేనయ్యా నాకు రిలీఫ్?? అంటాడు. అలా రాజమౌళి క్యామియోను సినిమాకు బాగానే వాడుకుంది ?మజ్ను? టీం.

,  ,  ,  ,  ,  ,