Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2016 13:10:33
facebook Twitter Googleplus
Photo

చిత్రం, నువ్వు-నేను, జయం వంటి విభిన్నమైన సూపర్ డూపర్ హిట్ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు తేజ డైరెక్షన్ లో వైష్ణవి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి.సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ నిర్మాతలుగా నూతన చిత్రం ?అహం? ప్రారంభం కానుంది. ఈ చిత్రం ద్వారా ఓ నూతన కథానాయకుడు పరిచయం అవుతున్నారు. అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం, అహుతి, ఎవ‌డైతే నాకేంటి వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో హీరోగా న‌టించి టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న డా.రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్ గా సరికొత్త క్యారెక్ట‌ర్‌లో నటిస్తుండటం విశేషం. రాజశేఖర్ సరసన ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుంది. నారాయణ్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

,  ,  ,  ,