Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 12:11:22
facebook Twitter Googleplus
Photo

మహారాజా ఒకప్పుడు ఎంత స్పీడ్ గా సినిమాలు చేసేవాడో తెలిసిన విషయమే. అయితే రవి తేజ చివరగా 2014లో పవర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కిక్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బెంగాల్ టైగర్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో రవితేజ తన కెరీర్ లో ఎప్పుడు లేనంతగా గ్యాప్ ఇచ్చాడు. ఎవరు ఊహించని విధంగా 2016 ను మిస్ అయిన రవి మళ్లీ తన గత వైభవాన్ని చూపించడానికి రెడీ అయ్యాడు.

అనిల్ రావిపుడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే సినిమాను చేశాడు రవితేజ. గత కొంత కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఫైనల్ గా నిర్మాత దిల్ రాజు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు. అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని దిల్ రాజు తెలిపారు. ఈ సినిమాను దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్ముస్తూన్నాడు. సినిమాలో రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ట్రైలర్ - టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక సినిమాలో రవితేజ సరసన మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటికే ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్నాడు కాబట్టి.. సినిమాతో కూడా దీపావళి పండుగనాడు ప్రకాశవంతంగా వెలిగిపోతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

,  ,  ,  ,  ,