Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 15:37:50
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తోన్న ?కబాలి? సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తోనే అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా సినిమా మే నెల నుంచి జూన్‌కు వాయిదా పడిందనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇక ఇదే విషయమై రజనీని సంప్రదించగా ఆయన కూడా సినిమా జూన్‌లోనే విడుదలయ్యే సూచనలున్నాయని తెలపడం విశేషంగా చెప్పుకోవచ్చు.
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఓ సందర్భంగా రజనీ ?కబాలి? ప్రస్తావన తెచ్చారు. మే నెలాఖర్లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉందని, అది వీలుకాకపోతే జూన్ మొదటి వారంలో సినిమా విడుదలవుతుందని ఆయన అన్నారు. తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న పా. రంజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో మే నెల్లోనే విడుదల కానుంది.

,  ,  ,  ,  ,  ,