Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 12:36:37
facebook Twitter Googleplus
Photo

రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి.. ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించడానికి ప్రధాన కారణం.. ఒకటి రజినీ అయితే.. రెండోది 'నిప్పు రా' సాంగ్. ఆ పాట సాధించిన విజయం.. వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ్ లో 'నెరుప్పు డా' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పుడీ టైటిల్ పై ఓ కోలీవుడ్ మూవీ తెరకెక్కనుంది. ఇందులో హీరో రజినీకాంత్ మాత్రం కాదు.

శివాజీ గణేశన్ మనవడు.. ప్రభు కుమారుడు.. విక్రమ్ ప్రభు హీరోగా 'నెరుప్పు డా' అనే చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాలో రజినీకాంత్ ని గెస్ట్ రోల్ చేయమని అడిగితే.. పాత పరిచయాలు బేస్ చేసుకుని సై అన్నారట సూపర్ స్టార్. నెరుప్పుడా చిత్రంలో హీరో ఓ ఫైర్ సర్వీస్ లో పని చేస్తూ ఉంటాడు.. అలాగే రజినీ అభిమాని కూడా. ఓ సీన్ లో హీరోకి రజినీకాంత్ కనిపిస్తాడు. ఆ సన్నివేశంలో నిజంగానే రజినీకాంత్ తో చేయించాలని యూనిట్ భావించగా.. అదే ప్రపోజల్ రజినీ దగ్గరకు వెళ్లింది.

శివాజీ గణేశన్ తోను.. ప్రభుతోను.. రజినీకాంత్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. వారిద్దరితో కలిసి సినిమాలు కూడా చేశాడు రజినీ. కొత్త దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కించనున్న ఈ మూవీలో.. ఫ్యామిలీ ఫ్రెండ్ కుమారుడు విక్రమ్ ప్రభు కావడంతో నెరుప్పుడా లో చేసేందుకు రజినీ సై అన్నారట.

,  ,  ,  ,  ,  ,