Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 11:22:44
facebook Twitter Googleplus
Photo

రిచ్ డాడ్.. రిచ్ విలన్.. జగపతిబాబును చూస్తే ఇలాంటి పాత్రలే గుర్తుకొస్తున్నాయి ఈ మధ్య. నాన్నకు ప్రేమతో ఆడియో వేడుక సందర్భంగా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు జగపతి. తాను అన్ని రకాల పాత్రలు చేయగలనని.. కానీ ఈ రిచ్ పాత్రలకే తనను పరిమితం చేసేస్తున్నారని అన్నాడు జగపతి. ఐతే ఇప్పుడున్న దర్శకులకే కాక.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు సైతం తాను ?రిచ్?గానే కనిపించానని జగపతి చెబుతున్నాడు.

కథానాయకుడు సినిమాలో ముఖ్య పాత్రలో వెళ్లానటించడానికి వెళ్లినపుడు రజినీకాంత్ గారు తొలి రోజు నన్ను చూసి.. చాలా రిచ్ గా ఉన్నాడే అని సందేహం వ్యక్తం చేశారు. కానీ నేను.. లేదండీ.. నేను రిచ్ గానే కాదు పిచ్చి పిచ్చిగా కూడా కనిపించగలను అని చెప్పి ఆ గెటప్ వేసుకుని వచ్చి చూపించా. ఆయన ఓకే అన్నారు. రామ్ గోపాల్ వర్మ నన్ను పెద్దరికం సినిమాలో చూసి గాయం కోసం ఎంపిక చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలకు ఏమైనా పోలిక ఉంటుందా దర్శకులు అనుకుంటే ఎలాగైనా మార్చేస్తారు. నేను ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలను అని జగపతిబాబు అన్నాడు.

,  ,  ,  ,  ,