Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2016 11:29:51
facebook Twitter Googleplus
Photo

సమ్మర్ హాలిడేస్ అందరు స్టార్లు టూర్లు వెళ్లిపోతున్నారు. కూల్ ప్లేస్ లలో చిల్ జిల్ అనిపించే ప్రదేశాలకు వెకేషన్స్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమకిష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి హాలీడే టూర్ వెళ్లిపోయారు.

ప్రస్తుతం కబాలికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిషింగ్ దశకు తీసుకొచ్చిన రజినీకాంత్.. తన కుటుంబం మొత్తంతో కలిసి అమెరికా టూర్ కి వెళ్లారు. ఒకవైపు కబాలికి సంబంధించిన పనులతో పాటు.. మరోవైపు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు రజినీ. చాలామంది తమ సినిమా పనులు పూర్తి చేసుకుని.. రిలీజ్ లు అయ్యాక ఫారిన్ టూర్స్ వెళ్తే.. రజినీ మాత్రం విడుదలకు ముందే అమెరికా వెళ్లిపోవడం విశేషం. గత కొన్ని నెలలుగా సినిమా బిజీలోనే గడపడంతో.. హాలీడే టూర్ ద్వారా రిలాక్స్ అవచ్చనే ఆలోచన చేశారట. ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చారని.. జూన్ నుంచి మళ్లీ రోబో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

రెండు వారాల పాటు సూపర్ స్టార్ అమెరికా టూర్ ఉంటుందట. ఆ తర్వాత రోబో సీక్వెల్ పనులు చేస్తూనే.. కబాలికి సంబంధించిన ప్రమోషనల్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంటుంది. జూలై 1న విడుదల చేసేందుకు నిర్ణయించిన కబాలికి.. ఇంకా ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించలేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ కానుండడంతో.. భారీ పబ్లిసిటీ కేంపెయిన్ నే ప్లాన్ చేశారట కబాలి మేకర్స్.

,  ,  ,  ,  ,  ,  ,