Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 10:58:37
facebook Twitter Googleplus
Photo

గతంలో 'శివాజీ', 'రోబో' వంటి సూపర్ హిట్ చిత్రాలకు కలసి పనిచేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల తాను చేసిన 'లింగా' సినిమా డిజాస్టర్ కావడంతో వెంటనే మరో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో రజనీ పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. ఈ క్రమంలో శంకర్ కూడా ఓ కథ చెప్పడం జరిగిందని, దానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇందులో విలన్ పాత్రకు హీరో విక్రంను ఎంచుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీనికి 'నెంబర్ వన్' అనే టైటిల్ నిర్ణయించినట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,