Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 11:01:46
facebook Twitter Googleplus
Photo

మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ పెంచుకునేందుకు మహేష్ ఈ బైలింగ్యువల్ చేస్తున్నాడని గతంలోనే చెప్పుకున్నాం. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పుడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిన సంగతులు అభిమానులకు షాకింగ్ గా మారిపోయాయి.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. మహేష్ బాబు-మురుగదాస్ ల సినిమా అప్ డేట్స్ చెప్పేసింది రకుల్. ఈ మూవీ కోసం ఇంకా తన వెర్షన్ ను.. ఇంకా చాలా షూటింగ్ జరపాల్సి ఉందని.. ఇప్పటికి 50 శాతమే పిక్చరైజ్ చేశారని చెప్పింది రకుల్. అలాగే మహేష్ పాత్ర కూడా ఇప్పటికి 50 శాతమే షూటింగ్ పూర్తయిందట. హీరో హీరోయిన్ల పాత్రలే సగం షూటింగ్ అంటే.. సినిమా పరిస్థితి కూడా అంతే. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే.. ఇప్పటికి ఆరు నెలల నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

చైన్నై.. హైద్రాబాద్.. ముంబై.. అహ్మదాబాద్.. బ్యాంకాక్.. ఇలా ఇప్పటికి 10 షెడ్యూల్స్ వరకూ పూర్తి చేశారు. ప్రస్తుతం కడపలో షూటింగ్ జరుపుతున్నారు. వీటిలో కొన్ని షెడ్యూల్స్ అయితే ఏకంగా నెలల తరబడి సాగాయి. ఇంత చేసినా సగం వరకే షూటింగ్ అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ప్రస్తుతం ఉన్న స్పీడ్ లో చెప్పిన డేట్ కి సినిమా వస్తుందా రాదా అని అనుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

,  ,  ,  ,  ,  ,  ,