Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 12:25:53
facebook Twitter Googleplus
Photo

టాప్ హీరోయిన్గా స్థానం సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ తన కెరియర్ లో మంచి ఫామ్ లో ఉంది అనే చెప్పాలి. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తన అందంతో అందరినీ ఆకట్టుకున్నా.. ఆ తరవాత చాలా సినిమాలలో హాట్ గా నటించింది. కిక్2 - బ్రూస్ లీ లాంటి మెగా ప్రాజెక్టు లలో కూడా నటించి తెలుగు కమర్షియల్ సినిమా హీరోయిన్ గా ఎదిగింది. కిందటి ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ‘రారాండోయ్ వేడుక చూద్దాం’లో కూడా మంచి నటనను ప్రదర్శించి మరో హిట్ కొట్టింది.

రెండు రోజులు కిందట అబు ధబి లో జరిగిన సైమా(SIIMA) అవార్డ్స్ వేడుకలో.. 2016 ఏడాది విడుదలైన సినిమాలుకు అవార్డ్స్ అందజేశారు. సౌత్ ఇండియా స్టార్స్ అందరూ వచ్చి పండుగ జరుపుకున్నారు. అందరి మాటా ఏమో గాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఆకాశంలో తేలుతుంది ఎందుకంటే నాన్నకు ప్రేమతో సినిమాకు గాను ఈ ఏడాది ఉత్తమ నటిగా ఎంపిక చేశారు SIIMA వాళ్ళు. ఈ అవార్డ్ కు ఒక స్పెషల్ ఉంది అది ఏంటి అంటే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ లో నామినేట్ అయినా తనకు దక్కిన మొదటి ఉత్తమ నటి అవార్డ్ సైమా అవార్డ్. అందుకని రకుల్ కు ఈ అవార్డ్ నాకు చాల స్పెషల్ అని చెబుతుంది. తొలిసారి గుర్తించినందుకు థ్యాంక్స్ అంటోంది. ఏదైనా మరి మొదటి అవార్డ్ కదా ఆ మాత్రం ఉంటుందిలెండి.

2016 సరే రకుల్ పట్టుకుపోయింది మరి 2017 కూడా రకుల్ తోటి హీరోయిన్లుకు గట్టి పోటీనే ఇస్తుంది. ఎందుకంటే రారాండోయ్ వేడుక చూద్దాం లో నటించి మెపించింది అందరినీ. ఇప్పుడు మహేశ్ బాబు ‘స్పైడర్’ సినిమాలో నటిస్తోంది.

,  ,  ,  ,