Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 14:09:27
facebook Twitter Googleplus
Photo

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ నటి అని చెప్పుకోవచ్చు. చాల మంది హీరోయిన్లు వస్తున్నా అందరి ఫోకస్ ను తననుండి తిప్పుకోకుండా చూసుకుంటుంది. మిగతా హిరోయిన్లులా కాకుండా తన దృష్టి అంతా తెలుగు సినిమా పై పెట్టడం ఈమెకు పెద్ద ప్లస్ అయ్యింది. అందుకోసం తెలుగు కూడా తొందరగానే నేర్చుకుందీ పొడగరి. తాజా విజయం రారండోయ్ వేడుక చూద్దాం తో తన ఆనందానికి హద్దులు లేవు అని చెబుతుంది. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు కోసం అమ్మడు రెడీ అవుతోంది.

సాధారణగా బాలీవుడ్ లో హీరోయిన్లు వాళ్ళు చేసే పాత్ర ను బట్టి ప్రమోషన్ లో కూడా అలానే కనిపించి ఆ సినిమా ఫీల్ ఏంటో చెప్పడానికి కాస్ట్యూమ్స్ ద్వారా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా రకుల్ అదే ఫాలో అవుతుందేమో చూడండి. రారండోయ్ వేడుక చూద్దాంలో తను చేసిన పాత్ర ఒక మామూలు తెలుగు ఆడపిల్ల కాబట్టి ఆ సినిమా ప్రచారం కోసం సినిమా రిలీజయ్యే వరకు పూర్తిగా ఓణీలు లెహంగాలు చీరలు తరహా డ్రస్సులు వేసుకుని ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా సంగతి పూర్తయ్యింది కాబట్టి.. అమ్మడు మళ్ళీ మోడ్రన్ దుస్తుల్లో తన స్థాయి గ్లామర్ తో దాడి చేస్తోంది. నిన్న ఒక ఈవెంట్లో అమ్మడు ఇలా మోడ్రన్ గులాబీలా తన గుబాళింపులు విరబూయించిందిలే.

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగు ప్రజలు అంతా ఎదురుచూస్తున్న సినిమా మహేశ్ బాబు స్పైడర్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఈ సినిమాలో రకుల్ ఒక డాక్టర్ పాత్రలో నటించబోతుంది అని తెలుస్తుంది.

,  ,  ,  ,  ,