Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 14:47:56
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన రకుల్ ప్రీత్ నటనలోనే కాదు నిజ జీవితంలోను తన వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకుంటుంది. స్టార్ హోదా ఎంత హాయిని ఇచ్చినా మంచి పని చేస్తేనే మనస్సుకు ఆనందాన్ని ఇస్తుందని చెబుతోంది రకుల్. ఈ రోజు ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా రకుల్ తన పుట్టిన రోజు వేడుకలను ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంది.

బిజీ షెడ్యూల్ ఉన్నా సరే రకుల్ అందరిలా ఉన్నతంగా బర్త్ డే వేడుకలను చేసుకోకుండా మొదట అనడపిల్లలతో హాయిగా గడిపింది. అంతే కాకుండా వారికి బుక్స్ స్వీట్స్ ని కూడా ఇచ్చి చాలా ఆనందపడింది. అయితే ప్రతి హీరోయిన్ పుట్టిన రోజు ముందు ఇలా ఎందుకు చేస్తారు అని అడిగితే రకుల్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. ''సాధారణంగా నాకు బర్త్ డే అని ఇలా వ్యవహరించడానికి అంతగా ఇష్టం ఏమి ఉండదు. సాధారణంగా నేను ఎప్పుడైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. అంతే కాకుండా నా ఫ్యామిలీ - ఫ్రెండ్స్ తో కలిసి ఇతర కార్యక్రమాల్లో పార్టీలో కూడా పాల్గొంటాను. ఇక నా అభిమానులు కూడా తరచు నాకు టచ్ లో ఉంటారు సో ఎప్పుడైనా నాకు సేమ్ డే బర్త్ డే స్పెషల్ అని ఏమి లేదు'' అంటోంది అమ్మడు.

ఇక రకుల్ ఈ రోజు తన ఫ్రెండ్స్ తో స్పెషల్ పార్టీ సెట్ చేసుకుందట. ప్రస్తుతం రకుల్ రెండు తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ చిత్రంలో కూడా రకుల్ మరోసారి మహేష్ తో నటించనుంది.

,  ,  ,  ,  ,