Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2017 11:11:32
facebook Twitter Googleplus
Photo

కొంతమంది ఏళ్ళు తరబడి నటిస్తూనే ఉంటారు. మరికొందరు ఒక సినిమా మ్యాజిక్ తో మాయమైపోతారు. ఎవరు ఎలా ఎన్నేళ్లు ఉంటారు అనేది ఆ చేసే వారికి తెలియదు చూస్తున్న ప్రేక్షకులకు అంతకన్నా తెలియదు. హీరోలను పక్కనపెడితే మిగతా వారు అంతా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. ఏడాదికి ఒక కొత్త హీరోయిన్ బ్యాచ్ వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది రెండు బ్యాచ్లు వరకు పోటీ ఇవ్వగలుగుతారు మరికొంత మంది మార్పు వేగంలో కొట్టుకుపోతారు. అసలెందుకు హీరోయిన్లు పదేళ్ళు కన్నా ఎక్కువ కాలం మన్నలేకపోతున్నారు అనే ప్రశ్నకు కొత్తందం రకుల్ ప్రీత్ సింగ్ ఇలా అనేసింది.

మన పాత హీరోయిన్లు శ్రీదేవి - జయప్రద - జయసుధ - విజయశాంతిలాంటి వారు దశాబ్దాల పాటు కెరియర్ని విజయవంతంగా నడిపించుకోగలిగితే ఇప్పుడు ఎందుకు అలా కుదరటం లేదు అనే ప్రశ్నకు రకుల్ ఏమంటోందంటే.. నయనతార - అనుష్క - త్రిష లాంటి వారు ఇప్పటికి టాప్ హీరోయిన్లు గా ఉన్నారు కదా!! అయినా అలాంటి అవకాశాలు అందరికీ రావు. చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడం అనేది అదృష్టం. ఉదాహరణకు తమన్నా చాలా చిన్న వయసులోనే వచ్చింది ఇప్పుడు తను మంచి హీరోయిన్ గా ఇంకా జనాదరణ పొందుతూనే ఉంది. ముప్పై ఏళ్ళు దాటితే హీరోయిన్ గా కొనసాగటం కష్టం. కానీ నేను ఎప్పుడూ ఇన్నేళ్ళు చేయాలి అని ఏమీ అనుకోలేదు. రకుల్ బాగనే చేస్తుందిలే అని జనాలు అనుకున్నంత వరకు చేస్తాను అని చెప్పింది. అలా అంటూనే ఎన్నేళ్ళు ఉన్నాం అనేదానికన్నా ఎన్ని మంచి సినిమాలు చేయగలిగాం అనేదే చూస్తాను అంటోంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో బిజీ గా ఉన్న హీరోయిన్లులా లిస్ట్ లో ఉంది. తన రోబోతున్న సినిమా స్పైడర్ లో మహేశ్ బాబు కి జంటగా నటిస్తుంది. స్టార్ హీరోలు తో చేస్తూనే చిన్న హీరోలు తోను జత కడితే.. జయ జానిక నాయక సినిమాతో వచ్చేస్తోంది.

,  ,  ,  ,