Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 11:38:06
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో లక్కీయెస్ట్ గాళ్ ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్ పేరు తప్ప మరో యాక్ట్రెస్ పేరు వినిపించే ఛాన్స్ లేదు. సినిమాల విషయంలోనే కాదు.. ఆఫర్లలోనూ అదే రేంజ్ లో ఉంది అమ్మడి జోరు. ఇక వరుసగా హిట్లు సాధించడం కూడా అమ్మడి స్పీడ్ ని బాగా పెంచేసింది. గతేడాది వరకూ వరుసగా ఫ్లాప్స్ ఇబ్బంది పెట్టినా.. ఈ ఏడాది ప్రారంభం నుంచే జోరు చూపిస్తోంది రకుల్.

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీతో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్.. సమ్మర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సరైనోడుతో సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఒకే ఏడాది ఇద్దరు బడా హీరోలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన రకుల్.. ఇప్పుడు మూడో బడా చిత్రం షూటింగ్ ని కూడా మొదలుపెట్టేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ధృవ చిత్రంలో..రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది ఈ భామ.

ఇప్పుడీ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది. రామ్ చరణ్ - రకుల్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బ్రూస్ లీలో కలిసి నటించిన ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతోందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. త్వరలో పాటల షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్- అల్లు అర్జున్ - రామ్ చరణ్.. ఒకే ఏడాదిలో ఇలా స్టార్ హీరోలతో సినిమాలు ఫినిష్ చేసిన రికార్డు.. రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కదానికే సొంతమయేలా ఉంది.

,  ,  ,  ,  ,  ,