Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 10:45:17
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ ల క్రేజీ కాంబినేషన్లో రూ.80 కోట్లతో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్వీ. ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకూ ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు కూడా తెరపడింది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఫైనలయిందని తెలుస్తోంది. అంతేగాక రకుల్ ప్రీత్ ఆగష్టు 11 నుండి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ జూలై 29 నుండి ప్రారాంభంకానుంది. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు ?ఎస్. జె. సూర్య? విలన్ గా నటించనుండగా, హరీస్ జయరాజ్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,