Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2015 15:16:00
facebook Twitter Googleplus
Photo

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వద్దంటే అవకాశాలు వచ్చిపడుతున్నాయి రకుల్ కి. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోందా? అయినా సరే... కొత్త సినిమాల వేట ఆపలేదు. తాజాగా మహేష్ బాబుతో కలిసి `బ్రహ్మోత్సవం`లో నటించే ఛాన్స్ కొట్టిందని ఫిల్మ్ నగర్ జనాలు చెప్పుకొంటున్నారు. తొలుత ఆ ఆఫర్ రకుల్ కే వచ్చింది. కానీ అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు చేయలేనని చెప్పిందిట. దీంతో వేరే కథానాయికల్ని సంప్రదించారు. ఇటీవలే సమంత కాజల్ ప్రణీతలని ఎంపిక చేసుకొన్నారని ప్రకటన వెలువడింది. అయితే ఇంతలో మళ్లీ రకుల్ పేరు వినిపించడం మొదలైంది. ఆ ముగ్గురు కథానాయికల్లో ఒకరు తప్పుకొన్నారా లేదంటే రకుల్ ని నాలుగో హీరోయిన్ గా తీసుకొన్నారా అన్నది తేలాల్సి వుంది.

సినిమాలో మాత్రం మహేష్ బాబు బోలెడంత మంది మరదళ్లు ఉంటారట. మహేష్ కి మరదళ్లంటే అందమైన కథానాయికలే కావాలి కదా! అందుకే నలుగురైదుగురు హీరోయిన్లు తెరపై కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. మరి రకుల్ ని ఎంపిక చేసుకొన్న మాట నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రకుల్ కి మనసంతా మహేష్ సినిమాపైనే ఉంది. మహేష్ లాంటి అందగాడి సరసన నటిస్తే ఆ ప్రభావం వేరేలా ఉంటుందని రకుల్ నమ్ముతోంది. అందుకే మొదట్నుంచీ `బ్రహ్మోత్సవం` టీమ్ తో కనెక్టయ్యే ఉంది. దీంతో ఆమెకి ఆఫర్ దక్కిందని సమాచారం.

ఇటీవలే శ్రీమంతుడుతో హిట్టు కొట్టిన మహేష్ ప్రస్తుతం హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకి వెళ్లినట్టు సమాచారం. అక్కడ్నుంచి తిరిగి రాగానే `బ్రహ్మోత్సవం` కోసం రంగంలోకి దిగుతారు. వచ్చే నెల 15 నుంచి ఆ సినిమా షూటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. మహేష్ బ్రహ్మోత్సవంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల తయారు చేసిన కథ చాలా బాగుందని పదే పదే చెబుతున్నాడు.

,  ,  ,  ,