Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2016 10:53:59
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ఇప్పుడు యాక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. అందుకే ఈ స్టార్ కి బాధ్యతలు ఎక్కువైపోయాయి. పైగా రామ్ చరణ్ కి ఛారిటీ యాంగిల్ లో కూడా బోలెడంత మంచి మనసుంది. కానీ అన్నీ ఒకేసారి ఒకే నెలలో ప్లానింగ్ చేసుకోవాల్సి రావడంతో.. మెగా పవర్ స్టార్ కి అక్టోబర్ నెలంతా ఫుల్లుగా ప్యాక్ అయిపోయింది.

ధృవ చిత్రాన్ని అక్టోబర్ లోనే రిలీజ్ చేయాల్సి ఉండగా.. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడంతో.. వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే.. నవంబర్ రెండో వారానికల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ తో ఉన్న రామ్ చరణ్.. అక్టోబర్ లో రెండు వారాల పాటు ధృవకు డేట్స్ ఇచ్చాడు. ఈ షెడ్యూల్ లో టైటిల్ సాంగ్ తోపాటు.. మరోపాటను కూడా షూట్ చేయనున్నారట. ఇది పూర్తి కాగానే.. అక్టోబర్ 15న న్యూ జెర్సీలో జరిగే ఓ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉంది. ఛారిటీ కోసం ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమంలో చెర్రీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంది.

ఇది పూర్తి కాగానే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఖైదీ నెంబర్ 150 టీమ్ తో జత కానున్నాడు రామ్ చరణ్. యూరోప్ షెడ్యూల్ వారానికి పైగా ప్లాన్ చేయగా.. తను నిర్మాత కావడంతో ఆ వారమంతా యూరోప్ లోనే ఉండడనున్నాడని తెలుస్తోంది. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా.. అక్టోబర్ లో ఆదివారాలు పండుగ రోజుల్లో కూడా షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడట మెగా పవర్ స్టార్.

,  ,  ,  ,  ,