Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:10:57
facebook Twitter Googleplus
Photo

అన్ని స్టోరీస్ లో అందరూ హీరోలూ యాక్ట్ చేయలేరు. కథ విపరీతంగా నచ్చేసి దాన్ని మెటరియలైజ్ చేద్దామన్నా వాళ్లకున్న బౌండరీస్ దాటి రిస్క్ చేయలేరు. పైగా స్టార్ హీరో మూవీసంటే బడ్జెట్ దగ్గర్నుంచి అన్నీ లెక్కలేసుకోవాల్సిందే. అందుకే కొన్ని ఫీల్ గుడ్ స్టోరీస్ ని వదిలేయడం మినహా ఏమీ చేయలేరు. అందుకే తమ రేంజ్ కి తగ్గ మూవీస్ లో నటిస్తూనే కొత్త వారిని ఎంకరేజ్ చేయడం కోసం.. ఉన్నవాళ్లకి బ్రేకివ్వడం కోసం బ్యానర్స్ పెట్టి సినిమాలు తీయడం బాలీవుడ్ హీరోలకి అలవాటే. కోలీవుడ్.. మాలీవుడ్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయ్.

ఇక మీదట టాలీవుడ్ లోనూ అలాంటి సీన్స్ రెగ్యులర్ కాబోతున్నాయ్. అల్రెడీ పవన్ కల్యాణ్ తన పేరు మీద పవన్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ పెట్టి తాను నటించడమే కాకుండా నితిన్ తోనూ మరో మూవీ తీస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బాబాయ్ రూట్ ఫాలో అయిపోతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ ఖైదీ నెంబర్ 150ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఫ్యూచర్లోనూ తన బ్యానర్ నుంచి కంటిన్యూగా మూవీస్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

త్వరలో తన ఫ్రెండ్స్ కమ్ హీరోసైన శర్వానంద్.. అక్కినేని అఖిల్ తోనూ సినిమాలు నిర్మించనున్నాడు చెర్రీ. వీళ్ల మూవీస్ కి సంబంధించిన కథలు కూడా ఫైనలైజ్ అయ్యాయని టాక్. వన్స్ అన్ని క్లియరైన తర్వాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చంటున్నారు. నిజానికి సొంతంగా బ్యానర్ పెట్టేశాడు కాబట్టి ఇక మీదట హోం బ్యానర్ కే పరిమితమైపోతాడేమో.. ఫ్యామిలీ హీరోలతో మాత్రమే చెర్రీ సినిమాలు నిర్మిస్తాడేమో అనుకొన్నారు చాలామంది. కానీ చరణ్ మాత్రం థింక్ డిఫరెంట్ అంటూ బయట హీరోలతో మూవీస్ ని లైన్లో పెట్టాడు. అంటే ఓ వైపు హీరోగా.. మరోవైపు నిర్మాతగా డబుల్ యాక్షన్ చేయనున్నాడు. ఆల్ ద బెస్ట్ చెర్రీ.

,  ,  ,  ,  ,  ,