Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2017 12:35:26
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికే స్టార్ రేంజ్ అందుకున్న వారి నుంచి మీడియం రేంజ్ లో ఉన్నవారు.. చిన్న హీరో స్థాయి వారు.. కాబోయే హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి వారితో పాటు ఓ హీరోయిన్ కూడా వచ్చేసింది. ఇక రాబోయే కాలంలో కాబోయే హీరోల లిస్ట్ కూడా రెడీగానే ఉంది.

మెగా ఫ్యామిలీలో లేటెస్ట్ జనరేషన్ అంతా ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ వారసులు అంతా రీసెంట్ గా ఓ ఫ్యామిలీ పార్టీలో కలిశారు. అక్కడ అందరూ కలిసి చాలానే సందడి చేయగా.. రామ్ చరణ్ తీసిన ఓ సెల్ఫీ భలే చూడముచ్చటగా ఉంది. హీరోయిన్ గా సత్తా చాటేందుకు ట్రై చేస్తున్న నీహారిక.. సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ సెల్ఫీలో కనిపిస్తారు. రంగస్థలం కోసం గుబురుగా పెంచేసిన గడ్డంతో రామ్ చరణ్ లుక్ సూపర్బ్ గా ఉంటే.. హీరోయిన్ గా మారిన తర్వాత నీహారిక మరింత అందంగా మారిపోయింది.

మరోవైపు గతంతో పోల్చితే కాసింత ఒళ్లు చేసిన వైష్ణవ్ తేజ్.. గడ్డం-మీసం పెంచి క్లాస్- మాస్ మిక్స్ చేసిన లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.

,  ,  ,  ,  ,