Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2015 17:12:16
facebook Twitter Googleplus
Photo

తన తండ్రి విషయం అనవసర ప్రేలాపనలు చేసేవాళ్లను అస్సలు ఉపేక్షించనని అంటున్నాడు రామ్ చరణ్. తన విషయంలో ఏమన్నా లైట్ తీసుకుంటా కానీ.. తండ్రి చిరంజీవి గురించి వ్యతిరేక ప్రచారం చేస్తే ఊరుకోనంటూ చిరు హేటర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు చరణ్. ?రుద్రమదేవి? వచ్చిన వారానికే ?బ్రూస్ లీ? సినిమాను విడుదల చేయడం మీద కొన్ని విమర్శలు రావడం.. ఆపై ?బ్రూస్ లీ?కి నెగెటివ్ గా ప్రచారం చేయడం గురించి చరణ్ స్పందించాడు.

కొందరు అదే పనిగా చిరు గురించి మెగా ఫ్యామిలీ గురించి ప్రతికూల ప్రచారం చేస్తున్నారని.. ఐతే తన తండ్రిని ఎవ్వరు ఏమన్నా తాను చూస్తూ కూర్చోనని.. అలాంటి వాళ్లను తేలిగ్గా వదలనని చరణ్ అన్నాడు. తనే కాదని మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా ఈ విషయంలో ఉపేక్షించరని చరణ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఐతే తన గురించి వచ్చే విమర్శల్ని మాత్రం తాను పట్టించుకోనని చరణ్ అన్నాడు. ??నా మీద వచ్చే విమర్శలు కామెంట్లన్నింటికీ వివరణ ఇస్తూ పోతే.. ఆ మాటలన్న వారి స్థాయికి నేను దిగజారి పోయినట్లే. ఇదంతా టైమ్ వేస్ట్ వ్యవహారం?? అని చరణ్ తేల్చేశాడు. ?బ్రూస్ లీ? సినిమాకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోందని.. మెగాస్టార్ క్యామియో రోల్ ను అభిమానులు బాగా ఆస్వాదిస్తున్నారని చరణ్ చెప్పాడు.

,  ,  ,