Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2015 14:21:36
facebook Twitter Googleplus
Photo

పంచ్ అదిరింది. కిక్ కుదిరింది.బ్రూస్‌లీ వేట మొద‌లైంది. ఆట షురూ అయ్యాక అప్పుడే.. విజిళ్ల మోత ..రికార్డుల రాత ..మొద‌లైంది. రామ్‌చరణ్ న్యూఫిల్మ్ ?బ్రూస్ లీ?? ?బాహుబలి? రికార్డులన్నింటినీ తుడిచేస్తుంది. ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్‌లో బాహుబలి రికార్డును ఆ..సినిమా బీట్ చేసినట్టు వెబ్ మీడియాలో ఒకటే హంగామా నెల‌కొంది. బాహుబలి తెలుగు వెర్షన్ రైట్స్ గల్ఫ్‌లో 45 లక్షలకు వెళ్లింది. ఈ రికార్డుని ఇప్పట్లో అధిగమించే ఫిల్మ్ రావడం కష్టమనే క్యాంపెయిన్ కూడా సాగింది. తాజాగా బ్రూస్ లీ 47 లక్షలకు వెళ్లినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్‌కు ఖుషీగా ఉన్నారట. పైకి ప్ర‌క‌టించ‌క‌పోయినా మెగా ఫ్యామిలీ కూడా ఫుల్ జోష్‌లో ఉంద‌ని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి 15 నిమిషాలు స్క్రీన్‌పై హల్‌చల్ చేయనున్నాడన్న వార్త కూడా ఈ సినిమా హైప్ పెరిగేందుకు మరో రీజన్‌. త్వరలోనే బాహుబలిని రికార్డ్స్‌ని బ్రూస్ లీ అధిగమించడం ఖాయమన్న‌ది సోషల్ మీడియాలో మెగా అభిమానుల ధీమా.చెర్రీ- రకుల్ ప్రీత్‌సింగ్ కాంబినేషన్‌లో రెడీ అవుతున్న ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ నిర్ణ‌యించారు.అంతేకాదు శ్రీ‌మంతుడు సినిమా గ‌ల్ఫ్‌లో రూ.43ల‌క్ష‌కు అమ్ముడుపోగా.. ఆ.. రికార్డ్‌ను సైతం బ్రూస్ లీ సునాయాసంగా అధిగ‌మించేశాడు.

,  ,  ,  ,