Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 15:26:00
facebook Twitter Googleplus
Photo

వివాదాల వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అంటకాగనిదే నిదురపోడన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి వివాదం కాదు కానీ పబ్లిక్ ని స్టన్ కి గురి చేసే ఓ కామెంట్ చేశాడు వర్మ.

ఆత్మవిశ్వాసం బలమైన నమ్మకం ఉన్న వ్యక్తుల్ని నేనెక్కడా చూడలేదు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న పోర్న్ స్టార్ టోరి బ్లాక్. తన ఇంటర్వ్యూలు రెగ్యులర్ గా చూస్తుంటాను. అయితే నేను తను నటించే పోర్న్ సినిమాలకు ఫ్యాన్ ని కాను. తనలోని వ్యక్తిత్వానికి మాత్రమే అభిమానిని. బలమైన వ్యక్తిత్వం ఉన్న పోర్న్ స్టార్ కాబట్టి విపరీతంగా అభిమానిస్తాను. అందుకే తన ఇంటర్వ్యూలు పదే పదే చూస్తానని చెప్పాడు. అంతేనా .. అసలు నేను బోలెడంత మంది పోర్న్ స్టార్లను ఇష్టపడతానని బిడియ పడకుండా కామెంట్ చేశాడు.

ప్రతి మనిషిలో ఇద్దరుంటారు. ఒకడు పైకి కనిపించేవాడు వేరొకడు కనిపించనివాడు. ఆ రెండో మనిషిని బైటపెట్టేవాడే మగాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని సిసలైన మగాడు అనాలేమో! చాలా మంది బూతు వెబ్ సైట్లను చాలా సీక్రెట్ గా చూస్తుంటారు. కానీ బైటికి ఆ సంగతిని ఒప్పుకోవాలంటే తెగ సిగ్గు పడిపోతారు. కానీ వర్మకు అలాంటి భయం బిడియం లేవు. లోన ఉన్నది ఏదైనా ఇలా మనసు విప్పి మాట్లాడేస్తుంటాడు.

తన ఆటోబయోగ్రఫీ `గన్స్ అండ్ థైస్`ని పోర్న్ స్టార్ టోరి బ్లాక్ కి అంకితమిస్తున్నానని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.

,  ,  ,