Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 14:05:40
facebook Twitter Googleplus
Photo

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రారంభం నుంచి ఇప్పటివరకూ జడ్జ్ గా వ్యవహరించిన రోజాకు.. ఆ షో నిర్వాహకులు ఉద్వాసన పలకబోతున్నారని ఇప్పటికే వార్తలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో నాగబాబుతో పాటు జడ్జ్ గా వ్యవహరించే మరో జడ్జ్ విషయంలో కూడా ఇప్పటికే నిర్మాతలు ఓ క్లారిటీకి వచ్చేశారట.

జబర్దస్త్ కార్యక్రమానికి తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు రోజాని తప్పించినా ఆ ప్లేస్ లోకి తీసుకోబోయే వ్యక్తికి అంతటి ఇమేజ్ ఉండి తీరాలి. అందుకే రోజాకి సమ కాలికురాలైన రమ్యకృష్ణను.. ఈ కార్యక్రమానికి జడ్జ్ గా ఉండాల్సిందిగా కోరారట. ఆమె నుంచి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అందిందని తెలుస్తోంది.

ఇప్పటికీ వరుసగా సినిమాల్లో చేస్తుండడం బాహుబలిలో శివగామి పాత్ర తర్వాత రమ్యకృష్ణ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడంతో పాటు.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లేకపోవడం కూడా.. రమ్యకృష్ణను ప్రిఫర్ చేయడానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. రోజాను తొలగించి రమ్యకృష్ణను తీసుకునే విషయంలో.. షో నిర్వాహకుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,