Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jan-2017 16:32:45
facebook Twitter Googleplus
Photo

మామూలుగానే నన్ను చాలామంది పిచ్చోడిలా చూస్తారు.. ఘాజి సినిమా ఒప్పుకున్నాక మరింత పిచ్చోడిలా చూశారు అన్నాడు రానా దగ్గుబాటి. ఘాజి సినిమా విషయంలో తన ప్రయాణం ఎలా సాగిందో చెబుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రానా.

ఘాజీ సినిమా గురించి నాకు చెప్పిన వ్యక్తికి.. ఈ సినిమాకు అసలే సంబంధం లేదు. మా నిర్మాణ సంస్థతో కలిసి పని చేసే రామ్మోహన్ గారు నాకీ చిత్రం గురించి చెప్పారు. ఆయన కార్లో వెళ్తుంటే సబ్ మెరైన్ సెట్ వేస్తున్న సంగతి గమనించారట. దాని గురించి ఆరా తీసి నాకు చెప్పారు. ఆ తర్వాత సంకల్ప్ నన్ను కలిశాడు. అతను సినిమా ఖరారవకముందే సెట్ రెడీ చేసుకున్నాడు. నాకు ఈ కథ చెప్పాడు. అప్పటికి ?బాహుబలి? పనిలో బిజీగా ఉన్నాను. అది ముగించాక మళ్లీ ఈ కథ ఎక్కడ ఉందా అని ఆరా తీస్తే పీవీపీ గారి దగ్గరుందని తెలిసింది. నేనే వాళ్లకు కబురు పెట్టాను. సినిమా చేయడానికి సిద్ధపడ్డాను.

హైదరాబాద్ లో నాకు తెలిసిన రచయితలు.. బాలీవుడ్ నుంచి కొందరిని పిలిపించి స్క్రిప్టు వర్క్ చేయించాను. దాదాపు 15 వెర్షన్లు రాయించాం. మొదట అనుకున్న వెర్షన్ కు చివరగా చేసిందానికి పోలిక లేదు. అంతలా స్క్రిప్టుకు మెరుగులు దిద్దాం. మామూలుగానే జనాలు నన్నో పిచ్చోడిలా చూస్తారు. ఇక తెలుగులో నేనొక సబ్ మెరైన్ బేస్డ్ వాటర్ ఫిలిం చేస్తున్నానంటే నాకు తెలిసిన వాళ్లందరూ నన్ను మరింత పెద్ద పిచ్చోడిలా చూశారు. ఓ డెబ్యూ డైరెక్టర్ తో ఇలాంటి సినిమా చేస్తున్నానంటే చాలామంది వద్దని వారించారు. కానీ రాజమౌళి గారు మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. నేను సరైన దారిలోనే వెళ్తున్నానని చెప్పి ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం వల్ల ఈ రోజు ఒక గొప్ప సినిమా చేశానన్న సంతృప్తి మిగిలింది. కరణ్ జోహార్.. అమితాబ్ బచ్చన్ లకు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చింది. కరణ్ అందుకే ఈ సినిమాను హిందీలో తనే రిలీజ్ చేస్తున్నారు?? అని రానా వెల్లడించాడు.

,  ,  ,  ,  ,  ,