Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 11:29:02
facebook Twitter Googleplus
Photo

ఇండియాన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి చేర్చే రెండు భారీ చిత్రాలు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఘనవిజయం సాధించిన చిత్రాలకు సీక్వల్గా తెరకెక్కటం మరో విశేషం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాకు సీక్వల్గా బాహుబలి 2 రూపొందుతుండగా, క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో రోబో 2 మరింత భారీగా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయన్న వార్త కొద్ది రోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇంతటి భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయితే కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుందని భావించారు. అయితే ఈ వార్తలపై బాహుబలి నటుడు రానా క్లారిటీ ఇచ్చేశాడు.

??ఇంతటి భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావటం అసాధ్యం, అయినా ఈ రెండు చిత్రాలకు ఇంకా షూటింగ్తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరగాల్సి ఉంది. ఇప్పుడే ఆ సినిమాల రిలీజ్ గురించి చెప్పలేం. అయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ చిత్రాలు ఒకే రిలీజ్ అవ్వవు. బాహుబలికి రోబోతో పోటీ ఉండదు..?? అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం సింగపూర్లో జరుగుతున్న సైమా అవార్డ్స్లో పాల్గొంటున్న రానా మీడియాతో మాట్లాడుతూ బాహుబలి రిలీజ్పై క్లారిటీ ఇచ్చాడు.

,  ,  ,  ,  ,  ,  ,