Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Oct-2017 12:45:37
facebook Twitter Googleplus
Photo

యువతులకైనా ఓ వయసు వచ్చే సరికి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న మరి ని పెళ్లెప్పుడు? ఇది వినగానే ముందు అమ్మాయిలకు ఏ స్థాయిలో కోపం వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అబ్బాయిలైతే లైట్ గా స్మైల్ ఇస్తూ మెల్లగా అక్కడి నుండి జారుకుంటారు. రానా ని కూడా రీసెంట్ గా చైతు - సమంత పెళ్లిలో ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరు అడిగి అడిగి పిచ్చెక్కించారట.

అయితే వారికి కనపడకుండా ఎక్కువగా పెళ్లిలో దాగుడుమూతలు ఆడానని తన స్నేహితులతో చెప్పుకున్నాడు రానా. ఈ రోజుల్లో కొందరు హీరోలు పెళ్లిళ్ల గురించి పక్కన పెట్టి కెరీర్ సక్సెస్ ట్రాక్ లో ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. టాలీవుడ్ లో బడా బ్యాచిలర్స్ ఇప్పుడు చాలామందే ఉన్నారు. ఇక రానా మాత్రం మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నా కూడా అప్పుడే పెళ్లి మాట వద్దంటున్నాడు.

ఘాజి - బాహుబలి అలాగే నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలనే ఒకే చేస్తున్నాడు. అంతే కాకుండా తీసే సినిమాలు చాలా కొత్తగా ఉండాలని కూడా ప్రయోగాలు చేస్తున్నాడు రానా. ప్రస్తుతం తమిళ్ ఫిల్మ్ 1945 అనే సినిమాతో రానా బిజీగా ఉన్నాడు.

,  ,  ,  ,