Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2017 11:41:44
facebook Twitter Googleplus
Photo

దగ్గుబాటి రానా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ హ్యాండ్సమ్ హంక్ నటించిన మూవీ ఘాజీ.. రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1971లో జరిగిన ఇండో-పాక్ వార్ కు సంబంధించిన రియలిస్టిక్ థీమ్ ను.. సినిమాటిక్ గా మలచడంలో కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యాడు.

అయితే.. ఘాజీ మూవీ విజయం తర్వాత అభిమానులు రానాకు కొత్త బిరుదు తగిలించేశారు. ఇప్పుడీ దగ్గుబాటి హీరోను అంతా 'వార్ స్టార్' అనేస్తున్నారు. ఇందుకు కారణం.. యుద్ధ నేపథ్యంతో రానా నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవుతుండడమే. మొదట బాహుబలి ది బిగినింగ్.. ఆ తర్వాత అనుష్క లీడ్ రోల్ లో వచ్చిన రుద్రమదేవి.. ఇప్పుడు ఘాజీ.. ఇలా వరుసగా రానా నటించిన చిత్రాలన్నీ యుద్ధ నేపథ్యం ఉన్నవే కాగా.. అన్నీ విజయాలు సాధించడంతో వార్ స్టార్ అయిపోయాడు రానా.

మరో విషయం ఏంటంటే.. ప్రస్తుతం తెలుగు-తమిళ్ బై లింగ్యువల్ మూవీగా సత్యశివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 1945 అనే చిత్రం కూడా ఇలాంటి థీమ్ తోనే రూపొందుతోంది. రెండో ప్రపంచ యుద్ధం.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన ఘట్టాలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయి.

,  ,  ,  ,  ,  ,