Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2015 10:01:54
facebook Twitter Googleplus
Photo

'లింగా' చిత్రం పంపిణీదారుల బాధను రజనీకాంత్ అర్థం చేసుకున్నాడు. ఈ సినిమా పంపిణీ చేయడం వల్ల తమకు విపరీతంగా నష్టాలొచ్చాయంటూ తమిళనాడుకు చెందిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు నిరసన దీక్షలు చేస్తూ, ఈ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. సమస్య ముదరడంతో ఇక తను నడుం బిగించాలని రజనీ నిర్ణయించుకున్నాడట. ఈ నేపథ్యంలో కోయంబత్తూర్ కు చెందిన ప్రముఖ పంపిణీదారు తిరువూర్ సుబ్రమణియన్ ను పిలిచి, సినిమా వసూళ్ళపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని పురమాయించాడట. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరికెంత నష్టపరిహారం చెల్లించాలనేది రజనీ నిర్ణయిస్తాడు.

,  ,  ,  ,  ,