Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 11:37:22
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పద్మావతి సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా బాహుబలి స్థాయిలో కలక్షన్లు సాధిస్తుందని అక్కడి ట్రేడ్ పండితుల ఉవాచ. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ను వరుసగా బాహుబలికి రాజమౌళి ఎలాగైతే క్యారక్టర్లన్నీ పరిచయం చేస్తూ ఇంప్రెస్ చేశాడో.. అదే తరహాలో భన్సాలీ కూడా రిలీజ్ చేయిస్తున్నాడు. ఆల్రెడీ దీపికా పదుకొనె మరియు షాహిద్ కపూర్ లుక్స్ అలాగే రిలీజ్ అయ్యాయ్. ఇప్పుడు మరో హీరో లుక్ కూడా వచ్చింది.

తన కెరియర్లో తొలిసారిగా విలన్ పాత్రలో మెరుస్తున్నాడు హీరో రణవీర్ సింగ్. రియల్ లైఫ్ లో దీపిక ప్రియుడు అయిన రణవీర్.. ఈ సినిమాలో మాత్రం రాణి పద్మావతిపై మనస్సు పాడేసుకుని.. ఎలాగైనా సరే ఆమె పొందును పొందాలని ఆమె భర్తను భర్త రాజ్యాన్ని నాశనం చేసిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ ను చూస్తే.. అబ్బో ఇరగదీశాడు అంతే. యుద్దాల్లో వీరుడు అని చెప్పడానికి కంటి కింద గాటు.. అలాగే పిల్లి కళ్లు.. మస్లిం తరహా లుక్ క్రియేట్ అయ్యేలా బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి విలన్ గా ఒక రేంజులో తన నటరసాన్ని ఆరబోస్తాడని ఈ పోస్టర్లు చెప్పకను చెబుతున్నాయి.

బాలీవుడ్ జనాలను బాగా ఊరిస్తున్న పద్మావతి సినిమా డిసెంబర్ 1న రిలీజవుతోంది. ఎప్పటిలాగానే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ భన్సాలీ సారే అందిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,