Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2015 11:49:06
facebook Twitter Googleplus
Photo

ఊహలు గుసగుసలాడే సినిమా టైమ్ లో అనుకుని ఉండదు. తనకి ఈమాత్రం కెరీర్ అయినా ఉంటుందని టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోతానని. కానీ ఈ అమ్మడికి అన్నిరకాలా కలిసొచ్చింది. మొదటి సినిమా విజయం సాధించాక కొన్ని పరాజయాలు ఇబ్బంది పెట్టినా.. అవకాశాలకు ఢోఖా ఏం లేదు. ప్రస్తుతం ఓ రెండు మాస్ సినిమాల్లో నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన బెంగాల్ టైగర్ చిత్రంలో నాయికగా నటిస్తోంది. అలాగే సాయిధరమ్ తేజ్ సరసన ఓ చిత్రంలో ఆడిపాడుతోంది.

ఇదంతా మీరు ఊహించిందేనా? భవిష్యత్ ప్రణాళికలేంటి? అని ప్రశ్నిస్తే గడుసుగానే సమాధానమిచ్చింది. అవును .. భవిష్యత్ గురించి కలలు గనకుండా ఉండలేం. మంచి భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నా. అంతేకాదు.. ఇప్పుడు నేను నా కెరీర్ని చూస్తున్న తీరు వేరుగా ఉంది. ప్రారంభం వేరొకలా ఉండేదాన్ని. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసింది. జయాపజయాల్ని అర్థం చేసుకుంటున్నా.. అని చెప్పింది. వామ్మో నటించిన నాలుగైదు సినిమాలకే ఇంత మారింది. మునుముందు మరిన్ని సినిమాల్లో ఛాన్సులు పెరిగే కొద్దీ మరింకెంత మారుతుందో? అన్నట్టు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే మహేష్ - చరణ్ - బన్ని - పవన్ లాంటి స్టార్లు వెంటపడాలి. ఆ రేంజులో ప్లాన్ చేస్తుందంటారా?

,  ,  ,  ,