Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Nov-2017 12:14:14
facebook Twitter Googleplus
Photo

రెండు కులాలు.. రెండు మతాలు. హైబ్రిడ్ పిల్ల అంటూ ఫిదా సినిమాలో సాయి పల్లవి చెప్పిన డైలాగ్ కి తెలుగు ప్రేక్షకులు బాగానే ఫిదా అయ్యారు. నేను కూడా అలాగే మిక్స్ డ్ బ్రీడ్. అందుకే చాలా డిఫరెంట్ అంటోంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. యాంకరింగ్ గ్లామర్ లుక్ తెచ్చిన ఈ భామ ఎన్ని షోలు చేసినా భాష కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది.

తన భాష ఎందుకలా ఉంటుందో రష్మి లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అమ్మది ఒరిస్సా. నాన్నదేమో ఉత్తర ప్రదేశ్. ఒకరకంగా చెప్పాలంటే మిక్స్ డ్ బ్రీడ్. పుట్టింది పెరిగింది విశాఖపట్నంలో. బంధువులేమో ఏమో నార్త్ లో ఉన్నారు. చదివింది సీబీఎస్ ఈ స్కూలులో. అందులో కంపల్సరీ ఇంగ్లీషే మాట్లాడాలి. అందుకే నాకు తెలుగు రాలేదు. ఇండస్ట్రీకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నా అంటూ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చింది. లైఫ్ లో ఒక్కటైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయాలని అనుకున్నానని.. ఇప్పుడు ఒకేసారి నాలుగైదు పెద్ద బ్యానర్లలో పనిచేయడం మాత్రం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది.

గుంటూరు టాకీస్ లో హాట్ లుక్స్ తో.. లిప్ లాక్ సీన్లతో ప్రేక్షకులను కవ్వించిన రష్మీ లేటెస్ట్ గా ఆది హీరోగా నటించిన నెక్ట్స్ నువ్వేలోనూ ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఈ సినిమాలో గడ్డివాము దగ్గర కుక్క తినదు.. ఇంకొకరిని తిననివ్వదు అనే డైలాగ్ బాగానే వైరల్ అయింది.

,  ,  ,  ,  ,