Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2016 12:48:35
facebook Twitter Googleplus
Photo

యాంకర్ కమ్ యాక్టర్ రష్మి గౌతమ్ నటించిన కొత్త సినిమా చారుశీల. ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. ఈ సినిమా కాపీ అంటూ ఓ నిర్మాత ఆరోపిస్తున్నారు. తమిళంలో జూలీ గణపతి పేరుతో వెటరన్ డైరెక్టర్ బాలూ మహేంద్ర తీసిన సినిమాను కాపీ కొట్టి ?చారుశీల?తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమా తెలుగు డబ్బింగ్, రీమేక్ హక్కులు తన దగ్గర ఉన్నాయని వాదిస్తునారు నిర్మాత శ్రీనివాస్ .

నమితని హీరోయిన్ గా పెట్టి ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించానని, శూర్పణక, జూలీ గణపతి అనే టైటిళ్లను కూడా తాను రిజిస్టర్ చేయించానని, ఇప్పుడు ఈ సినిమా కధను కాపీ కొట్టారని తెలిసిందని, దీనిపై చారుశీల నిర్మాతను సంప్రదించే ప్రయత్నం చేశానని.. కానీ వారి నుంచి సమాధానం లేదని.. అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నానని అంటున్నారు శ్రీనివాస్. మరి ఈ విషయంలో చివరికి ఎం తెలుతుందోగానీ , ఇలాంటి వివాదాలు చిత్రాలకు ప్రీ పబ్లిసిటీ తెచ్చిపెడతాయన్నది నిర్విదాంశం.

,  ,  ,  ,  ,