Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2016 15:45:23
facebook Twitter Googleplus
Photo

సినిమా ప్రచారం చేయడం అంటే చాలా క్రియేటివిటీతో కూడిన విషయం. తన మూవీస్ కి రకరకాల టెక్నిక్స్ తో తీయడంలోనే కాదు.. పబ్లిసిటీ చేసుకోవడంలో కూడా రవిబాబు దగ్గర చాలా ఐడియాలో ఉంటాయి. ఈ విషయంలో బోలెడంత ట్యాలెంట్ కూడా చూపించేస్తుంటాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'అదుగో' అనే మూవీ తీశాడు.

కొన్ని నెలల క్రితమే షూటింగ్ తో పాటు మిగిలిన పనులన్నీ పూర్తయిపోయినా.. ఈ మూవీ రిలీజ్ కి నోచుకోలేదు. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న రవిబాబు.. పనిలో పనిగా ప్రచారంలో తన స్టైల్ చూపించేస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత కారణంగా.. అందరూ ఏటీఎంల దగ్గర క్యూ లైన్ లో నుంచోవాల్సి వస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ ను వాడుకున్న రవిబాబు.. అదుగో మూవీలో యాక్ట్ చేసిన పంది పిల్లతో కలిసి ఏటీఎం లైన్ లో నుంచున్నాడు.

కుక్కలను తీసుకొచ్చి నుంచునేవాళ్లు కనిపిస్తారు కానీ.. ఇలా పందితో వచ్చిన దర్శకుడు క్యూలో నుంచోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సడెన్ గా ఈ పందిపిల్ల.. దర్శకుడు రవిబాబు.. అదుగో సినిమా.. అన్నీ హాట్ టాపిక్ అయిపోయాయి. ఒక్క పందిపిల్లతో ఏంటీఎం లైన్ లో నుంచుని.. ఈ రేంజ్ ప్రచారం పొందచ్చని ఆలోచించిన రవిబాబు తెలివికి అందరూ హ్యాట్సాఫ్ అనేస్తున్నారు.

,  ,  ,  ,  ,