Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 17:57:11
facebook Twitter Googleplus
Photo

మాస్ రాజా రవితేజకు రీమేక్ లు అస్సలు కలిసి రాలేదు. దొంగోడు.. వీడే.. నా ఆటోగ్రాఫ్.. శంభో శివ శంభో.. ఇలా వేరే భాషల నుంచి పట్టుకొచ్చిన ప్రతి సినిమా రవితేజకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో ఐదారేళ్లుగా రీమేక్ ల జోలికే వెళ్లలేదు మాస్ మహారాజ్. మధ్యలో తమిళ నిర్మాత త్యాగరాజన్.. ?స్పెషల్ చబ్బీస్? రీమేక్ ప్రపోజల్ రవితేజ ముందు పెట్టినా.. అతను ఒప్పుకోలేదు.

ఐతే ఇప్పుడు మరో బాలీవుడ్ రీమేక్ విషయంలో రవితేజ పేరు వినిపిస్తోంది. మూడేళ్ల కిందట బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ?జాలీ ఎల్ఎల్బీ? సినిమాను రవితేజ కథానాయకుడిగా తెలుగులో రీమేక్ చేసే ప్రపోజల్ అతడి ముందుకు వచ్చిందట. బొమన్ ఇరానీ.. అర్షద్ వార్సి కథానాయకులుగా నటించిన సినిమా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయం సాధించింది. ఇది ఇద్దరు లాయర్ల మధ్య ఆసక్తికరంగా సాగే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా.

?జాలీ ఎల్ఎల్బీ? దర్శకుడు సుభాష్ కపూర్ ఇంతకుముందు తీసిన ?ఫస్ గయారే ఒబామా? కూడా సూపర్ హిట్. అది ?శంకరాభరణం?గా తెలుగులోకి రీమేకైంది కూడా. తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ.. హిందీ వెర్షన్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ?జాలీ ఎల్ఎల్బీ? ఆల్రెడీ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ?మనిదన్? పేరుతో రిలీజై పర్వాలేదనిపించింది. మంచి హ్యూమర్ ఉన్న ఈ సబ్జెక్టు తనకు సూటవుతుందని రవితేజ కూడా ఆసక్తిగానే ఉన్నాడట. చూద్దాం నిజంగానే ఈ రీమేక్ తెరమీదికి వస్తుందేమో.

,  ,  ,  ,  ,  ,