Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2016 12:34:42
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ సినిమాలకు ఇప్పుడు ఫుల్లు గిరాకీ. కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను కూడా పట్టేశాడు. దీనికి తోడు 50 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాలు వరుసగా నాలుగు బన్నీ ఖాతాలో ఉన్నాయి. ఇదంతా సబ్జెక్టులు సెలక్ట్ చేసుకోవడంలో అల్లు వారబ్బాయి ట్యాలెంట్ అనే చెప్పాలి.

గత కొన్నేళ్లు స్టోరీల ఎంపిక విషయంలో బన్నీ చాలా సెలక్టివ్ గా ఉంటున్నాడు. స్టైలిష్ స్టార్ ని ఆ ఎలర్ట్.. ఇప్పుడీ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పచ్చు. కానీ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. బన్నీతో సినిమాకి లింగు స్వామి - విక్రమ్ కె. కుమార్ లు సిద్ధంగానే ఉన్నా.. దేన్ని మొదలుపెట్టాలనే విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే ఇది సబ్జెక్ట్ విషయంలో స్పష్టత రాకపోవడం కాదు. ఈ సినిమాలకు నిర్మాణంపైనే అసలు సమస్యంతా వస్తోంది. ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్.. తను నటించే సినిమాలను గీతా ఆర్ట్స్ సౌజన్యంతోనే ఉండాలని భావించడంతోనే ప్రాబ్లెం మొదలవుతోంది.

తెలుగు - తమిళ భాషల్లో తనే ప్రొడ్యూస్ చేయాలని లింగుస్వామి అనుకుంటున్నాడు. విక్రమ్ కె. కుమార్ అయితే.. ఓ పెద్ద కోలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ తో తీయాలని భావిస్తున్నాడు. బన్నీ సొంత సంస్థలో సినిమా తీస్తే ఫ్రీడం ఉండకపోవచ్చన్నది వీళ్ల ఆలోచన. కానీ తన సినిమాలు కురిపిస్తున్న కోట్లు చూసి.. లాభాలు వదులుకునేందుకు అల్లు అర్జున్ సిద్ధంగా లేడు. ఇదంతా తెలిసిన ఇండస్ట్రీ జనాలు.. అన్ని రోజులు ఒకేలా ఉండవ్ బన్నీ అంటూ జోకులు వేసుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,