Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2015 18:45:49
facebook Twitter Googleplus
Photo

అన్న టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. 600కోట్ల వసూళ్ల సినిమాకి సంగీతం అందించాడు. మునుముందు 1000 కోట్ల క్లబ్ సినిమాకి సంగీతం అందించే ఛాన్సుంది. అంత పెద్ద సంగీత దర్శకుడికి సోదరుడే అయినా కళ్యాణ్ కోడూరి కెరీర్ పరంగా ఇంకా స్ట్రగుల్ లైఫ్ స్టయిలే. అలా మొదలైంది గోల్కొండ హైస్కూల్ ఊహలు గుసగుసలాడే .. ఇలా హిట్ సినిమాలున్నా వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఏడాదికి అరడజను సినిమాలు చేసే సంగీత దర్శకుడు అనిపించుకోలేకపోతున్నాడు. అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది?

తమన్ - దేవీశ్రీ ప్రసాద్ - అనూప్ రూబెన్స్ - కార్తీక్ ఇలా ఎందరో యూత్ సంగీత ప్రపంచంలో దూసుకుపోయారు. ఏడాదికి డజను సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ తమన్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఉంది. కానీ కళ్యాణ్ కోడూరి ఎందుకు పాపులర్ కాలేకపోయారు? ప్రతిభ ఉండీ రేసులో వెనక బెంచీకే ఎందుకు పరిమితమయ్యాడు? ఆరాతీస్తే..

ఇది అసలే పట్టుపరిశ్రమ. పట్టు పట్టేవాడికి కాకా పట్టేవాడికే అవకాశం ఇక్కడ. ఏదో ట్యాలెంటు ఉంది కదా! అని ప్రమోషన్ చేసుకోకపోతే అంతే సంగతి. నలుగురితో గుంపులో కలిసిపోవాలి. ఇంత ఉంటే అంత ఉందని చెప్పుకోవాలి. బహుశా ఇలాంటి ఎక్స్ ట్రార్డినరీ ప్రమోషన్ చేసుకోలేకపోవడం వల్లే కోడూరి ఇలా అయ్యాడా? అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. అవకాశం లేకే ఖాళీగా కూర్చున్నా ..అని నిజాయితి గా ఒప్పుకున్నా.. ఇతరత్రా కారణాల్ని కోడూరి విశ్లేషించాలి కదా!

,  ,  ,