Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 11:01:02
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ కూడా చేశారు. సహజంగా ఒక సినిమాలో పాటను తెరకెక్కించేందుకు 3 రోజుల సమయం పడుతుంది. కానీ స్పైడర్ విషయంలో మాత్రం.. ఒక్కో పాటకు వారం రోజులు పడుతోందట.

తెలుగుతో పాటు.. తమిళ్ లోనూ తెరకెక్కుతున్న స్పైడర్ కోసం.. ప్రతీ సన్నివేశాన్ని రెండు సార్లు తెరకెక్కిస్తున్నారట. ఎక్కడా లిప్ సింక్ మిస్ కాకుండా.. రెండు సార్లు షూటింగ్ చేస్తున్నారట. మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి ఇలానే చేస్తున్నారట మురుగదాస్ అండ్ టీం. నిజానికి పాటలను ఒకసారి షూటింగ్ తో సరిపెట్టేసే అవకాశం ఉందని.. అయినా మహేష్ బాబు మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దని చెప్పాడట. అందుకే.. పాటలను కూడా రెండేసి సార్లు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. తెలుగు.. తమిళ్ తో పాటు.. మలయాళం.. హిందీ భాషల్లోనూ స్పైడర్ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న స్పైడర్ విడుదల కానుండగా.. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం.. అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది.

,  ,  ,  ,  ,  ,