Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2017 12:40:25
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్ వితిక.. సూసైడ్ చేసుకుందనే న్యూస్ రాగానే ఒక్కసారిగా ఫిలిం వరల్డ్ షాకైపోయింది. లేదు ఆమె అటెంప్ట్ చేసింది అనగానే కాస్త శాంతించినా.. అసలు అంత అవసరం ఏమొచ్చిందని అందరూ షాకయ్యారు. కాని నిప్పులేకుండా పొగ రాదుగా అంటూ చాలామంది కామెంట్లు కూడా చేశారు. అసలు హాస్పిటల్ కు ఆమె ఏ కారణంతో వెళ్లింది.. ఎందుకు ఇలాంటి న్యూస్ వచ్చింది? పదండి చూద్దాం.

ఓ రెండు వారాల క్రితమే అమెరికాలో వరుణ్ సందేశ్ తో గడిపి ఇండియాకు తిరిగొచ్చింది వితిక. అలా వచ్చిన తరువాత అమ్మడు ఇక్కడ కాస్త ఫ్రెండ్స్ తో పార్టీయింగ్ చేయడంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందట. అంతే కాదు.. అమెరికాలో పడుకునే టైమ్ మనం లేచుండే టైమ్ ఒకటే కాబట్టి.. ఇక్కడి టైమ్ జోన్ కు ఆమె ఇంకా అలవాటు కాలేకపోయింది. దానితో అందరూ పడుకునే టైముకు ఇక్కడ లేవడం.. లేచే టైముకు పడుకోవడం చేస్తోందట. అందుకే డాక్టర్ ఒకరు స్లీపింగ్ పిల్స్ ఇస్తే.. అవి వేసుకుని పడుకునేసరికి.. ఈమె తెల్లారి లెగలేదు. దానితో కంగారు పడిన పేరెంట్స్ ఆమెను స్టార్ హాస్పిటల్స్ కు తీసుకెళ్లారు. కట్ చేస్తే అక్కడ ఓ రెండు గంటల తరువాత నిద్ర లేచింది.

అయినా కేవలం నాలుగు స్లీపింగ్ పిల్స్ వేసుకుని ఎవరైనా సూసైడ్ ఎటెంప్ట్ చేస్తారా? మరీ తెలుసుకోకుండా అలా ఎలా చెప్పేస్తారు నా గురించి? మేం వచ్చే నెలలో మా మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోబోతున్నాం అంటూ లైవ్లో టివిల ముందుకొచ్చి మరీ చెప్పింది వితిక.

,  ,  ,  ,  ,