Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:55:54
facebook Twitter Googleplus
Photo

అవును. పాపం నిజంగా అండర్ రేటెడ్ హీరోయిన్ అనిపిస్తుంది ఆమెను చూస్తే. చెన్నయ్ నుండి ఇక్కడకు వచ్చి సందడి చేస్తున్న ఆ ముద్దుగుమ్మ పేరే రెజీనా కసాండ్రా. ఇప్పటికీ అమ్మడికి ఒక్క సరైన పెద్ద సినిమా కూడా పడలేదు. అయినాసరే ఆమె ఎవ్వరికీ తీసిపోదనే చెప్పాలి.

యాక్టింగ్ టాలెంట్ విషయంలో రెజీనాకు పేర్లు పెట్టక్కర్లేదు. అయితే గ్లామర్ విషయంలోనే ఆమె చాలా కట్టుబాట్లను కలిగియుంది కాబట్టి.. ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదు అని చెబుతుంటారు. కాని రెజీనా మాత్రం.. నేను గ్లామరసాన్ని పలికించినా కూడా నాకు ఛాన్సులు ఎవ్వరిస్తున్నారండీ అంటూ రివర్సులో మనల్ని ప్రశ్నిస్తోంది. ఇకపోతే నిన్న జరిగిన సాహసం శ్వాసగా సాగిపో ఆడియో లాంచ్ కార్యక్రమానికి అమ్మడు ఆ చిట్టి నడుముతో టీజ్ చేస్తూ.. చాలా హాట్ గానే విచ్చేసింది. సోకుల్లో నేనేం తక్కువ కాదు అన్నట్లు ఊరించింది. ఈ హాట్నెస్ ను తెరమీద మనమెందుకు ఉపయోగించుకోవట్లేదా అంటూ అందరూ షేకయ్యేంత రేంజులో అక్కడ వెలుగులు విరజిమ్మింది అనుకోండి.

ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన నక్షత్రం. అలాగే నాగ శౌర్య ప్రక్కన ''జో అచ్చుతానంద'' సినిమాల్లో నటిస్తోంది రెజీనా. ఈ రెండింటిలో ఒకటి సూపర్ డూపర్ హిట్టయినా కూడా ఆమె కెరియర్ కాస్త గ్రాండ్ గా టేకాఫ్ అవుతుందనే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,